శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా కార్యకర్త వినోద్‌పై దాడిని పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే వంకతో వినోద్‌ను అర్ధరాత్రి బలవంతంగా ఎత్తుకెళ్లి భౌతిక దాడి చేయడాన్ని తప్పుబట్టారు. దీనికి నిరసనగా పలాస పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు బైఠాయిస్తే.. బాధితుడిపైనే మళ్లీ తప్పుడు కేసులు బనాయించారంటూ చంద్రబాబు మండిపడ్డారు.
కొందరు పోలీసులు వైకాపా నాయకులతో కుమ్మక్కై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. 13 జిల్లాలలో గత 19 నెలల్లో 1,340 చోట్ల తెదేపా కార్యకర్తలపై భౌతిక దాడులు జరిగాయి. 16 మంది కార్యకర్తలను హత్య చేశారు. ఈ ఘటనలు రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వైకాపా దాడులు, దౌర్జన్యాలను మీడియా ఎప్పటికప్పుడు బయటపెడుతున్నా, కోర్టులు మందలిస్తున్నా ఆ పార్టీ నాయకుల్లోగాని, వారితో కుమ్మక్కైన పోలీసులలో గాని మార్పు రాలేదు. పలాస తెదేపా కార్యకర్త వినోద్‌పై బనాయించిన తప్పుడు కేసులు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలి- చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి