శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి బజారు కూడలి వద్ద ప్రధాన రహదారిపై నందన్నల (ఆంబోతులు) పోట్లాట.. ప్రయాణికులు, వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సుమారు గంటపాటు జరిగిన ఈ పోరులో.. ప్రధాన రహదారిపై వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు.
రోడ్డుపై రద్దీ తీవ్రంగా ఉండటం.. ఆంబోతులు పోట్లాడుకుంటా ప్రయాణికుల వైపు దూసుకెళ్లటం లాంటి పరిణామాలు.. అక్కడి వారిని ఆందోళన కలిగించాయి. రహదారులపై ఇలాంటి ఘటనలు జరగకుండా మున్సిపాలిటీ అధికారులు తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: