శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లిలో క్షుద్రపూజల పేరుతో కలకలం రేగింది. ఒక్కసారిగా గ్రామంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఏం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతూ కనిపించారు. ఏడాది కిందట ఇదేవిధంగా క్షుద్రపూజలు జరగటంతో భయంతో వణికిపోయిన గ్రామస్థులు, ఇప్పుడు క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం వల్ల భయాందోళనలు చెందుతున్నారు. ఏడాది క్రితం గ్రామంలో ఇలానే క్షుద్రపూజలు జరగ్గా, గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని.. దాంతో పూజలు ఆగాయని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని అధికారులు వెంటనే గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: తగ్గిన పసిడి దిగుమతులు- దిగొచ్చిన వాణిజ్య లోటు