ETV Bharat / state

ప్రధాని మోదీ మాటలనే పవన్ చెప్పారు: సోము వీర్రాజు - bjp leader somu veerraju news

ముందస్తు ఎన్నికలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రస్తావించిన మాటలనే పవన్ చెప్పారన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎంతోమంది ప్రముఖులు పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

somu veerraju
somu veerraju
author img

By

Published : Nov 19, 2020, 8:33 PM IST

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోందని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. 2024 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు.

అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాలని మోదీ భావిస్తున్నారు. అయితే ఈ ఆలోచనపై మొదట దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన అన్నారు. మోదీ ప్రస్తావించిన మాటలనే పవన్ చెప్పారు. కచ్చితంగా జమిలి ఎన్నికలు జరుగుతాయని చెప్పలేను. దీనిపై కేంద్రానిదే తుది నిర్ణయం. తూర్పుగోదావరి నుంచే భాజాపా, జనసేన జైత్రయాత్ర కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర నుంచి భాజాపాలోకి చేరికలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నారు.

ఇదీ చదవండి

2024 కన్నా ముందే ఎన్నికలు: పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.