ETV Bharat / state

"నీరు-చెట్టు" నిధులు విడుదలయ్యే వరకు.. తెదేపా పోరాడుతుంది: బీదా రవిచంద్ర

నీరు-చెట్టు పనులకు సంబంధించి ప్రతి పైసా విడుదలయ్యే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెదేపా నీరు-చెట్టు విభాగం సభ్యుడు బీదా రవిచంద్ర స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో పర్యటించి.. బిల్లులు విడుదల కాని వారి నుంచి వినతులు స్వీకరిస్తున్నామన్నారు.

నీరు చెట్టు నిధులు విడుదలయ్యే వరకు తెదేపా పోరాడుతుంది

author img

By

Published : Oct 30, 2021, 10:09 PM IST

నీరు-చెట్టు పనులకు సంబంధించి ప్రతిపైసా విడుదలయ్యే వరకు.. తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెదేపా నీరు-చెట్టు విభాగం సభ్యుడు బీదా రవిచంద్ర స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూన రవికుమార్‌తో కలిసి పాల్గొన్నారు.

పనులు చేసినా బిల్లులు విడుదల కాని వారి నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు బీదా స్పష్టం చేశారు. తెదేపా హయాంలో నాలుగు వేల కోట్ల అవినీతి జరిగిందని వైకాపా కేంద్రానికి ఫిర్యాదు చేసిందని.., అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తైనా అవినీతి నిరూపించలేక పోయిందన్నారు.

పనులు చేసిన వారందరికీ బిల్లులు చెల్లించాలని హైకోర్టు పలుమార్లు ఆదేశించినప్పటికీ.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. ఎన్టీఆర్ గృహ పథకం కింద గతంలో చేపట్టిన పనులకు కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. నేటికీ బిల్లులు చెల్లించలేదని కూన రవికుమార్‌ మండిపడ్డారు. ఈ సమస్యను వెలికితీసేందుకు.. అధినేత చంద్రబాబు ఆదేశం మేరకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తునట్లు రవిచంద్ర తెలిపారు.

ఇదీ చదవండి

వైకాపా దుర్మార్గాలను అడ్డుకునేందుకు.. ప్రజామద్దతు కావాలి : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.