గ్రామస్థులు ఓటుహక్కు వినియోగించుకున్న బ్యాలెట్ పత్రాలు రోడ్డుపై పడిఉండటం శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట గ్రామ పంచాయతీలో కలకలం రేపింది. తెదేపా బలపరిచిన అభ్యర్థి గుర్తైన... ఉంగరానికి ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలుగా వాటిని గుర్తించారు. ఎల్ఎన్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ నిర్వహించగా... అక్కడి విద్యార్థులకే ఆయా బ్యాలెట్ పత్రాలు దొరికాయి. ఎన్నికల అధికారులు పోలింగ్ మళ్లీ నిర్వహించాలని అభ్యర్థి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: జోరుగా రెండోదశ ఎన్నికల ప్రచారం