ETV Bharat / state

బాలుడిపై లైంగిక దాడి..యువకుడి అరెస్టు - శ్రీకాకుళం జిల్లా వార్తలు

బాలుడిపై లైంగిక దాడి జరిగిన ఘటన శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పుర్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు.

Baaludu pai laingika daadi
బాలుడిపై లైంగిక దాడి..యువకుడి అరెస్టు
author img

By

Published : Aug 5, 2021, 9:11 AM IST

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పుర్లి గ్రామంలో ఓ బాలుడిపై లైంగిక దాడి జరిగింది. బాలుడు సైకిల్​తో ఆడుకుంటుడగా అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు సమీపంలోని చెత్త కుండి పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలుడి తండ్రి పొలానికి వెళుతున్న సమయంలో కుమారుడి సైకిల్​ రహదారి పక్కన పడి ఉండడాన్ని గుర్తించాడు. కుమారుడి కోసం వెతుకుతుండగా సమీపంలోని చెత్త కుండి పక్కన అదే గ్రామానికి చెందిన యువకుడు కుమారుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. వెంటనే 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.

బాలుడిని పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

సింధుకు కాబోయేవాడు అలా ఉండాలట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.