శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వెంకయ్యపేటలో ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులతో కలసి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు వినూత్న పంథాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 1500 మందికి ఫేస్ మాస్కులు, శానిటైజర్లు అందజేస్తూ అవగాహన కల్పించారు. చేతులు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, ఏ విధంగా భౌతికదూరం పాటించాలి అనే అంశంపై విద్యార్థులు అవగాహన కల్పించారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఇదీ చూడండి అధికారులకు అధికార పార్టీ ఎమ్మెల్యే సవాల్..!