ETV Bharat / state

నాటు సారా తయారీ వద్దన్నందుకు వాలంటీర్​పై దాడి - శ్రీకాకుళం జిల్లా వార్తలు

నాటు సారా తయారు చేస్తున్నందుకు ప్రశ్నించాడని గ్రామ వాలంటీర్ పై శ్రీకాకుళం జిల్లాలో దాడి జరిగింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

attack on volunteer
నాటు సారా తయారీ వద్దన్నందుకు వాలంటీర్ పై దాడి
author img

By

Published : May 18, 2021, 12:36 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం గడగమ్మలో నాటు సారా తయారు చేయొద్దన్నందుకు గ్రామ వాలంటీర్ పై కొందరు దాడికి దిగారు. మూడో వార్డు గ్రామ వాలంటీర్ అరసాడ ప్రవీణ్.. సారా తయారు చేస్తున్న వారిని ప్రశ్నించాడు. ఆగ్రహించిన వారు నిన్న రాత్రి ప్రవీణ్ ఇంటికెళ్లి దాడికి పాల్పడ్డారు.

తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తలపై తీవ్ర గాయాలైన ప్రవీణ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై భాస్కరరావు తెలిపారు.

ఇవీ చదవండి:

భారత్​ను ఒంటరిగా చుట్టేసిన మహిళ- ఎలాగంటే?

రాజాంలో కుక్కలు స్వైర విహారం... 17 మందికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.