శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లక్ష్మీ నగర్ పాఠశాల వద్ద యూటీఎఫ్ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. సంఘ నాయకులు పేడాడ ప్రభాకర్ రావు మాట్లాడుతూ క్వారంటైన్‌కు ఇచ్చిన పాఠశాలలను శానిటైజ్ చేయలేదన్నారు. పాఠశాలలకు శానిటైజర్లు, మాస్క్‌లను పంపిణీ చేయలేదని తెలిపారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేసులున్నాయో అధికారులు విడుదల చేసిన లెక్కలు నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలను తెరవడం అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. నాడు-నేడు పేరుతో ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ బాధ్యతారహిత్యమైన నిర్ణయాన్ని విద్యాశాఖ వెనక్కుతీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ పి.ప్రభాకర్ రావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి టీవీటీ భాస్కర్‌రావు ,రావు తమ్మినేని పాపారావు, పి.అప్పలనాయుడు , బీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి