Assembly Speaker Tammineni Seetharam: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారంకు సమస్యల స్వాగతం కలికాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ ఇళ్ల వద్దకు వస్తున్న ఎమ్మెల్యేలను.. సమస్యలపై నిలదీస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేలనే కాకుండా స్పీకర్ను సైతం నిలదీయటానికి వెనకడుగు వేయలేదు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ క్రమంలో స్పీకర్ను ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలైన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని.. అర్హులైన వారి పింఛన్లను కూడా తొలగించారని గ్రామస్థులు మండిపడ్డారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ సుమారు నలభై రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే గ్రామంలోనే అడుగు పెట్టనని చెప్పి.. అక్కడి నుంచి వెనుదిరిగారు.
అసలేం జరిగిందంటే : శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం లక్కుపురం గ్రామంలో వైసీపీ నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మనేని సీతారం పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు.. ప్రభుత్వ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడిచిందని.. తమ గ్రామంలో ఇంతవరకు కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించటం లేదని ప్రశ్నించారు.
గ్రామంలో వీది దీపాలు వెలగటం లేదని అధికారులకు చెప్పిన పట్టించుకోవటం లేదని స్పీకర్ ముందు వాపోయారు. కనీసం తాగునీరు కూడా వారికి అందటం లేదని.. తాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని స్పీకర్ ముందుంచారు. నగదు ఇవ్వాలని, ధనం ఇవ్వమని అడగటం లేదని, తాగటానికి మంచినీళ్లు అడుగుతున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అర్హులైన వారి పింఛన్లను తొలగించరాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటింటికి కుళాయి అందిస్తామని అందించలేదని తెలిపారు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు స్పీకర్ స్పందిస్తూ.. గ్రామంలోని సమస్యలన్నింటిని 30 నుంచి 45 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. ఒకవేళ పరిష్కరించలేకపోతే గ్రామంలోనే అడుగుపెట్టనని గ్రామస్థులకు తెలిపారు. తక్షణమే గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇవీ చదవండి :