శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కాపాసుకుద్ది గ్రామంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. కొవిడ్-19 విధుల్లో ఉన్న ఆశా వర్కర్లకు ఎన్ 95 మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రత్యేక కొవిడ్ అలవెన్స్‌గా రూ.10 వేలు అందివ్వాలని కోరారు. తమను రెగ్యులరైజ్ చేసి చట్టపరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 ఆర్థిక సహాయం జనవరి నుంచి జూన్ నెల వరకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎన్ఎం శిక్షణ పొందిన ఆశా వర్కర్లను 2వ ఏఎన్ఎంగా గుర్తించాలని చెప్పారు. కొవిడ్-19 వ్యాక్సిన్ వచ్చేంతవరకు బీమా సౌకర్యాన్ని పొడిగించాలన్నారు. మార్చి 15 తర్వాత మరణించిన ఆశా వర్కర్లకు బీమా మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఆశా వర్కర్‌గా అవకాశం కల్పించాలన్నారు.
ఇదీ చూడండి:
ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని అడ్డుకున్న ప్రజలు.. గోబ్యాక్ అంటూ నినాదాలు