శ్రీకాకుళం గ్రామీణ మండలం పాత్రునివలస క్వారంటైన్లో ఉన్న ఆర్మీ జవాన్లు రోడ్డెక్కారు. రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నా...అధికారులు స్పందించకపోవడంతో కాలి నడకన కలెక్టర్‌ను కలిసేందుకు శ్రీకాకుళానికి వచ్చారు.
బలగ సమీపంలోని పెట్రోలు బంకు వద్ద వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఆర్మీ జవాన్లు పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. డీఎస్పీ మూర్తి వచ్చి నచ్చజెప్పి.. వీరందరిని మళ్లీ క్వారంటైన్‌కు పంపించారు. 20 రోజుల సెలవుపై జిల్లాకు వచ్చామని.. 14 రోజులపాటు క్వారంటైన్లో గడపాల్సి వస్తోందన్నారు. తమను హోం క్వారంటైన్‌కు పంపించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: భారత సైనికుల దెబ్బకు పరిగెత్తిన చైనా జవాన్లు!