శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులతో.. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ జి. శేఖర్ బాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు 95 శాతం వరకు వరి విత్తనాలు అందించినట్లు తెలిపారు. అలాగే రాయలసీమ అన్నదాతలకు నాలుగు లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రాయితీపై అందించామని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు వద్దకే విత్తనాలు చేరవేశామని... రైతు భరోసా కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని శేఖర్ బాబు చెప్పారు. ఈ క్రాప్‌లో రైతులు పండించే పంటల వివరాలు నమోదు చేసుకోవాలని తద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ డిప్యూటీ డైరక్టర్ రాబర్ట్ పాల్, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సంపత్, వ్యవసాయధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: