శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయడమే కాక, పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలోని పాలకొండలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభమైంది. 283 పోలింగ్ కేంద్రాల్లో 8 వందల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొనేందుకు వెళ్లారు. 12 రూట్లలో పోలీసు అధికారుల మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు.
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో 5 మండల అధికారులు, ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
నరసన్నపేట నియోజకవర్గంలోని 290 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించడం, ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయ్యింది.