ETV Bharat / state

ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్న రైతులు - ఏపీరైతు భరోసా కేంద్రాలు

Rythu Bharosa Centres: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో అవలంబించిన నూతన విధానం అన్నదాతలకు శాపంగా మారింది. మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా కేవలం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం కొనుగోలులో మాట తప్పింది. దీంతో గ్రామాల్లో ధాన్యం బస్తాలు కుప్పలుతెప్పలుగా పడి ఉన్నాయి. కొనుగోలు చేసే నాథుడు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jan 31, 2023, 12:45 PM IST

ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్న రైతులు

Rythu Bharosa Centres: శ్రీకాకుళం జిల్లాలో 1,62,719 హెక్టార్లలో వరి సాగు చేయగా ఈ ఏడాది ఎనిమిది లక్షల రెండు వేల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 20% అంటే 1,60,000 టన్నుల ధాన్యం సొంత వినియోగానికి కేటాయిస్తారని వ్యవసాయ శాఖ లెక్కలు పేర్కొంది. అయితే ప్రస్తుత మార్కెట్లో ఆరు లక్షల 42 వేల టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు వ్యవసాయ శాఖ నివేదిక తెలిపింది. ఇది ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా నాలుగు లక్షల 38 వేల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకుంది.

జిల్లాలోని 619 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇప్పటి వరకు మూడు లక్షల 83 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. అంటే ప్రభుత్వం నిర్దేశించుకున్న ధాన్యం కొనుగోలు లక్ష్యంలో ఇంకా 55 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇక మార్కెట్లో ఉన్న ధాన్యంతో పోల్చుకుంటే రెండు లక్షల 59 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి. సంక్రాంతి పండుగ ముందు ధాన్యం కొనుగోలు స్తంభించిపోయింది. సాంకేతిక కారణాలతో ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నామని అధికారులు చెబుతుండగా రైతులు కంటతడి పెడుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఏడాది కాలం పాటు కష్టపడి పండించిన ధాన్యం ఎలుకలు, పందికొక్కులపాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కుప్పతెప్పలుగా పడి ఉన్న ధాన్యం బస్తాలు చూసి కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

సంక్రాంతి పండుగ ముందు నూర్చినాము. అప్పటి నుంచి కల్లం మీదే ఉండిపోయాయి. వేరే వాళ్లు ఎవ్వరూ కొనడం లేదు. కొంటే ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రభుత్వమే వెనుకడుగు వేసింది. ఏదో ఒక విధంగా ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా చూస్తారనీ ప్రార్థిస్తున్నాము. -గుండ అప్పన్న, రైతు

మేము పంటకు చాలా పెట్టుబడులు పెట్టానాము. రైతులం ఒకటికి రెండు సార్లు అన్ని రకాల ఎరువులు, మందులు కొట్టి పండిచాం. ఇప్పటికీ కళ్లాల మీదనే ఉన్నాయి. 3 ఎకరాలకు ధాన్యం పండిచాం. ధాన్యం మా ఇంట్లో ఇప్పటికీ స్టాక్ ఉన్నాయి. రైతు భరోసా కేంద్రానికి తీసుకేళితే ఇవాళ, రేపు చెప్పుకుంటూ పోతున్నారు. -ఉమామహేశ్వరి, రైతు

మిల్లర్లు దగ్గరిగా వెళితే మాకు తేలిదని అంటున్నారు. లేకపోతే 4 కేజీలు మార్జీన్ ఇవ్వమంటున్నారు. మేము ఇప్పుడు ఎలా చేయ్యడం మాకు అనేది అర్ధం కావడం లేదు. రైతులుగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు సరైనా అవకాశం కల్పించి ప్రభుత్వం ధాన్నాన్ని కనుగోలు చేస్తే బాగుంటుంది. పేపర్​లో చూస్తే గింజ పోకుండా కోంటామనీ అంటున్నారు. -పోగోటి అప్పలస్వామి, రైతు

ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.