అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండాపురంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించింది. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. వ్యవసాయం కార్పొరేట్ సంస్థల చేతులకు పోకుండా ఉండేందుకు.. దేశ ఆహార భద్రత స్వావలంబనను కాపాడటానికి పోరాటాన్ని కొనసాగిస్తామని రైతులు ప్రతిజ్ఞ చేశారు.
ఇదీ చదవండి: ఆధార్లో సవరణల కోసం అవస్థలు.