శ్రీకాకుళం జిల్లా నుంచి పలువురు మత్స్యకారులు ఉపాధి నిమిత్తం గుజరాత్‌లోని వీరావల్ ప్రాంతానికి వెళ్లారు. విజయనగరం జిల్లా వారు కూడా ఈ బృందంలో ఉన్నారు. దాదాపుగా అయిదారు వేల మంది ఇప్పుడు అక్కడ చిక్కుకుపోయారు. లాక్‌డౌన్ ప్రకటించాక చేపల వేట నిలిపేశారు. లాక్‌డౌన్‌కు ముందే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఒక్కో బోటు క్రమంగా ఒడ్డుకు చేరుకుంటోంది. ప్రస్తుతం వారు వేటాడి వచ్చిన బోట్లే ఆవాసాలుగా మారాయి. ధరించటానికి సరైన దుస్తులు లేవు. రాత్రయితే దోమల బాధ. ఒక్కో బోటులో దాదాపు 15 మంది ఉంటున్నారు. వీరిని తీసుకువెళ్లిన కొందరు గుత్తేదారులు సరిగా పట్టించుకోవటం లేదు. తాము సముద్ర తీరంలోనే ఉన్నా... నగరాల నుంచి వస్తున్న వారి వల్ల తమకు ఎక్కడ కరోనా వ్యాపిస్తుందోనని వారు భయపడుతున్నారు. తమను జిల్లాకు తీసుకువచ్చి ‘క్వారంటైన్’లో ఉంచాలని వీరావల్‌లోని మత్స్యకారులు విన్నవిస్తున్నారు.
హార్బర్ నుంచి తరిమేస్తున్నారు...!
రెండు వారాలుగా చెన్నై హార్బర్‌లో తలదాచుకుంటున్న తమను గురువారం సాయంత్రం పోలీసులు బయటకు పంపేశారని జిల్లా మత్స్యకారులు పేర్కొన్నారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం నియోజకవర్గాలకు చెందిన మత్స్యకారులు చెన్నైలో ఉన్నారు. గురువారం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. దాదాపు 750మంది చెన్నైలో ఉండిపోయారు. గురువారం పోలీసులు వచ్చి హార్బర్ ప్రాంతంలో ఉండొద్దని పంపించేశారని వాపోయారు. తమ ఇబ్బందులపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, తమిళనాడు ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత బుధవారం వరకు అరకొర భోజనాలు సమకూర్చారని, గురువారం ఆకలితోనే ఉన్నామని చెప్పారు. తమను స్వస్థలాలకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: