అమూల్ సంస్థ ప్రపంచంలోనే ఖ్యాతిగడించిన డెయిరీ అని అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరక్టర్ ఏ బాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మంచి బ్రాండ్ ఇమేజ్ సంస్థలో వస్తు ఆధారిత విలువ పెరుగుతుందన్నారు. అమూల్ సంస్థ పాల సేకరణ విషయంలో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల... రాష్ట్రంలో ఒక చక్కటి సహకార విధానం రానుందని ఆయన పేర్కొన్నారు.
మహిళా సంఘాలు సహకార వ్యవస్థలో భాగస్వామ్యం కానున్నాయని బాబు చెప్పారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపరచుటకు ఇది చాలా దోహదపడుతుందని తెలిపారు. అమూల్ అనేది రైతులు ఏర్పాటు చేసుకున్న సంస్థ అని... రైతులే దీని యజమానులని వివరించారు.
ఇదీ చదవండి: భాజపా కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాది అరెస్ట్