శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రామ మందిరంలో పురోహితులు, బ్రహ్మశ్రీ వేదపండితులు, బలివాడ చిట్టి పంతులు ఆధ్వర్యంలో శ్రీ రామ శాంతి హోమాన్ని నిర్వహించారు. లోక కల్యాణార్థం రామజన్మభూమిలో ఆలయ నిర్మాణ శంకుస్థాపన మంచిగా జరగాలని, కరోనా వైరస్ మహమ్మారి నాశనం కావాలని హోమం చేపట్టినట్లు బలివాడ చిట్టి పంతులు తెలిపారు. దేశమంతా రామాలయ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతం చేయాలని రామాలయంలో పూజలు గ్రామాల్లో చిత్ర ఊరేగింపులు రామ నామ సంకీర్తనలు చేపడుతున్నారన్నారు. రామ్ మందిరంలో హనుమాన్‌కి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి