శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పరిధిలోని తమ్మయ్యపేట రేషన్ దుకాణాన్ని తహసీల్దార్ పూజారి రాంబాబు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు పరిశీలించారు. చౌకధరల దుకాణంలో అక్రమాలు జరుగుతున్నాయన్న గ్రామస్థుల ఫిర్యాదుతో తనిఖీలు చేశారు. రికార్డుల కన్నా తక్కువగా ఉన్న సరకును గుర్తించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దార్ రాంబాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి: