నరసన్నపేట సమీపంలోని తామరాపల్లి ఏపీ రెసిడెన్షియల్ మహిళా కళాశాల ప్రాంగణంలో ఏఐసీటీయూ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న సిబ్బందిని తొలగించడం అన్యాయమని ఆ సంఘం జిల్లా కన్వీనర్ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవిలోకి రాకముందు ఓ మాటి చెప్పి... ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనిచెప్పి... ఇప్పుడు తొలగించడం దారణమని ఆగ్రహించారు. ఈ విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన జోక్యం చేసుకుని... తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: