శ్రీకాకుళం సమీపంలో పాత్రునివలస కొవిడ్ కేర్లో ఉంటున్న కరోనా అనుమానితులు ఆందోళనకు దిగారు. తమకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. సమయం దాటిన తరువాతే ఆహారాన్ని ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మౌళిక సదుపాయాలు కూడా లేవనీ.. సరైన మందులు ఇవ్వటం లేదని వాపోయారు. తమకు నాణ్యమైన ఆహారాన్ని.. సరైన సమయానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'సోనూ' మరో సాయం.. స్వస్థలాలకు చేరిన రష్యాలోని భారత విద్యార్థులు