ETV Bharat / state

అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా - తెదేపా నేత అచ్చెన్నాయుడు తాజా వార్తలు

అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈఎస్ఐ కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడు.. బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

atchannaidu
atchannaidu
author img

By

Published : Jul 13, 2020, 5:59 PM IST

ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, తెదేపా శాసనసభ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈఎస్​ఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా అచ్చెన్న న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్‌ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చదవండి

అచ్చెన్నాయుడి పట్ల అంత కర్కశమా?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.