train hit 108 ambulances in Palasa: శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 108 అంబులెన్స్‌ను ఓ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌ను రైలు దాదాపు 100 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. ఓ రోగిని తీసుకొచ్చేందుకు ప్లాట్‌ఫామ్‌పైకి అంబులెన్స్ వెళ్తుండగా ఈ దుర్ఘటన(ambulances hit by train at palasa railway station) చోటుచేసుకుంది. అయితే.. ఈ ప్రమాదం నుంచి అంబులెన్సు డ్రైవరు, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
![](https://assets.eenadu.net/article_img/palasa1b.jpg)