శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తికి కొవిడ్ నిబంధనలను అనుసరించి 20 మందితో వివాహం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అందుకు విరుద్ధంగా అతను ఏకంగా 200 మంది సమక్షంలో వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. విషయంపై స్థానికులు ఫిర్యాదు చేయటంతో తహసీల్దార్ కాళీ ప్రసాద్, ఎస్ఐ అమీర్ ఆలీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు పెళ్లికొడుకు రాంబాబుకు 2,00,000 అపరాధ రుసుం విధించారు. భవిష్యత్తులో ఎవరూ ఇలా నిబంధనలు ఉల్లంఘించవద్దని హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. కొత్త జిల్లాల ఏర్పాటుకు.. ముందే అనుమతి తీసుకోవాలి: కేంద్రం