శ్రీకాకుళం జిల్లాలో పురుషోత్తపురానికి చెందిన ఓ వ్యక్తిని కరోనా పాజిటివ్ పేరుతో వాలంటీర్లు ఆస్పత్రికి తరలించారు. భర్తతో పాటు భార్యను కూడా తీసుకెళ్లారు. చికిత్స అనంతరం భార్య మూడు అనంతరం ఇంటికి చేరింది. ఈక్రమంలో ఇంటి దగ్గర ఉన్న వాళ్లు తండ్రి గురవయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అనుకున్నారు. కానీ గురవయ్య ఆచూకీ లేకుండా పోయింది. ఫొన్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో...కుటుంబసభ్యులు ఈనెల 3న రిమ్స్‌కు వెళ్లి విచారించారు. 12వ తేదీన చేరిన మాట వాస్తమేనని..మూడు రోజులు చికిత్స కూడా వైద్యులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి ఆచూకీ కనుగొని ఇంటికి చేర్చాలని కుమారుడు బాలరాజు అధికారులను వేడుకున్నాడు.
ఇదీ చదవండి
ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్