ETV Bharat / state

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పాల ట్యాంకర్.. తప్పిన ప్రమాదం

author img

By

Published : Apr 5, 2021, 9:47 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని తలవరం జంక్షన్ వద్ద త్రుటిలో ప్రమాదం తప్పింది. పాల ట్యాంకర్ టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి బస్సును ఢీ కొట్టి తర్వాత భారీ చెట్టును లారీ ఢీకొంది.

a milk tanker hit a rtc bus at srikakulam
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పాల ట్యాంకర్

శ్రీకాకుళం జిల్లా పాలకొండ వీరఘట్టం సీఎస్​పీ రోడ్డులో తలవరం జంక్షన్ వద్ద ప్రమాదం తప్పింది. పాలకొండ వైపు వెళ్తున్న పాల ట్యాంకర్ టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న భారీ వృక్షాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బస్సు, లారీ డ్రైవర్లు బయటపడ్డారు. లారీ చెట్టును ఢీకొనడంతో ఆ చెట్టు వెనకాల ఉన్న నాలుగు కుటుంబాలు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఇదీ చూడండి:

మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో.. పోలింగ్ కేంద్రాలు మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.