ETV Bharat / state

జిల్లాలో 14కు చేరిన కరోనా కేసులు - జిల్లాలో 14కు చేరిన కరోనా కేసులు సంఖ్య

శ్రీకాకుళం జిల్లాలో నేడు మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 14కు చేరుకున్నాయి. ఇవాళ నమోదైన 7 కేసులు చెన్నై నుంచి వారం రోజుల క్రితం వచ్చిన మత్స్యకారులని అధికారులు తెలిపారు.

జిల్లాలో 14కు చేరిన కరోనా కేసులు
జిల్లాలో 14కు చేరిన కరోనా కేసులు
author img

By

Published : May 17, 2020, 7:26 PM IST

Updated : May 17, 2020, 9:54 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో కేసుల సంఖ్య 14కు చేరుకుంది. అయితే మొదట నమోదైన కేసుల్లో.. నలుగురిని చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మూడు పాత కేసుల్లో పాతపట్నం ప్రాంతానికి చెందిన ఒక కేసులో వ్యక్తి ఆరోగ్యం కోలుకోవడంతో ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్​ చేశారు. దీంతో జిల్లాలో తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నాయి.

నేడు నమోదైన ఏడు కేసుల్లో ఇచ్ఛాపురం, సోంపేట, శ్రీకాకుళం మండలాల్లో రెండేసి చొప్పున కేసులు ఉండగా... కవిటి మండలంలో ఒక కేసు నమోదైన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసుల్లో ఐదుగురిని జిల్లా కోవిడ్ ఆసుపత్రి.. జెమ్స్​లో చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరికి విశాఖపట్నంలోని విమ్స్​లో చికిత్స అందిస్తున్నారని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగన్నాధరావు తెలిపారు. వీరంతా చెన్నై నుంచి వారం రోజుల క్రితం వచ్చిన మత్స్యకారులని తెలిపారు.

Last Updated : May 17, 2020, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.