ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక లారీలో డ్రైవర్ వెనుకభాగంలో ఒక రహస్య బాక్సు ఏర్పాటు చేసి అందులో గంజాయి ఉంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే లారీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ లను అదుపులోకి తీసుకున్నారు.
ఒక్కొక్కటి పదిన్నర నుంచి 11 కేజీలు ఉన్న 62 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చెప్పారు. సుమారు 682 కేజీలు ఉన్న గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ.14 లక్షల రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వినోద్ బాబు తెలిపారు.
ఇవీ చదవండి:
'23 రోజులుగా క్వారంటైన్లో ఉన్నాం.. ఇంకెప్పుడు విడిచి పెడతారు?'