32 people stuck in Maldives: ఉద్యోగం కోసం రాష్ట్రం నుంచి మాల్దీవులకు వెళ్లి చిక్కుకున్న 32 మంది తమను కాపాడాలంటూ, ఇక్కడి ప్రభుత్వాలను, నాయకులను కోరుతున్నారు. బాధితులు ఫోన్లో అందించిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం, పశ్సిమగోదావరి తో పాటు ఐదుగురు ఒడిశా వాసులు.. ఉద్యోగ నిమిత్తం ఈ ఏడాది ఏప్రిల్ లో మాల్దీవులకు వెళ్లారు. అక్కడ ఒక నిర్మాణ సంస్థలో అక్టోబర్ వరకు పనిచేశారు. వారికి మూడు నెలల వేతనాలు అందించిన యాజమాన్యం, తరువాత చేతులెత్తేసింది. పని లేదని తిరిగి వెళ్లిపోవాలని యాజమాన్యం తెలపడంతో.. దిక్కు తోచక రెండు నెలలుగా గదికే పరిమితమయ్యారు. తిండి తినడానికి కూడా డబ్బులు లేకపోవడంతో.. చాలీచాలని ఆహారంతో, పూట గడుపుతున్నారు. అక్కడ వేరే ఉద్యోగం దొరక్క, సొంతూరుకు వచ్చేందుకు.. డబ్బులు లేక అలమటిస్తున్నారు. బందువులు, సంబంధికులకు ఫోన్లు చేసి..తమ గోడును వెళ్లబోసుకున్నారు. కొన్ని కారణాలతో తమ పాస్ పోర్టులు ఇవ్వడంలేదని బాధితులు వివరించారు. తమను పంపిన ఏజెంట్ ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. బంధువులు వెల్లడించారు. బాధితుల్లో 25 మంది శ్రీకాకుళం జిల్లా వాసులు కాగా ఇద్దరు పశ్చిమగోదావరి, ఐదుగురు ఒడిస్సా వారు ఉన్నారు. ఏపీ ప్రజాప్రతినిధులు తమను ఆదుకోవాలని.. బందువులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: