Chowluru Ramakrishna Reddy Sister Madhumathi: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇటీవల దారుణ హత్యకు గురైన వైకాపా మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి సోదరి మధుమతి కుటుంబ సభ్యులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వెల్లడించారు. హిందూపురం పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. రామకృష్ణారెడ్డి ఆశయాల సాధన కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టు రామకృష్ణారెడ్డి సోదరి మధుమతి వెల్లడించారు.
పోలీసుల విచారణతో మీరు సంతృప్తిగా ఉన్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. తాము అసంతృప్తిగానే ఉన్నామని ఆమె తెలిపారు. ఈ కేసు విషయంలో తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. తమ అభ్యంతరం మేరకు హత్య కేసును.. నిష్పక్షపాతంగా పోలీసుల చేత పునఃవిచారణ చేసేలా చర్యలు చేపడతామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ హత్య కేసులో నిందితులకు శిక్ష పడేంత వరకు.. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌ను వ్యతిరేకిస్తామని తెలిపారు. ఆది నుంచి రామకృష్ణారెడ్డి కుటుంబం రాజకీయ చరిత్ర కలిగి ఉందని.. సోదరుడి ఆశయ సాధన కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు మధుమతి తెలిపారు. భవిష్యత్ రాజకీయాలలో పార్టీ అధిష్టానం ఏం ఆదేశిస్తే హిందూపురంలో మేము శిరసా వహిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: