ETV Bharat / state

జీవో నెంబర్ 1 నిబంధనలు వైసీపీకి వర్తించవా..! - రోడ్డుపై ప్రణీత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

YCP leader Birth celebrations on Road: రాజకీయ పార్టీలు బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు, ప్రదర్శనల నిర్వహణను అడ్డుకుంటూ ప్రభుత్వం జీవో నంబర్ ఒకటిని అమలులోకి తీసుకొచ్చింది. జీవో నెంబర్ ఒకటి కేవలం విపక్ష పార్టీలను అడ్డుకోవడానికే అని రుజువు చేస్తూ అధికార వైసీపీ నాయకులు యథేచ్ఛగా రద్దీ వేళలో జాతీయ రహదారిపై ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

YCP leader birthday celebrations
వైసీపీ నేత జన్మదిన వేడుకలు
author img

By

Published : Jan 11, 2023, 8:27 PM IST

Updated : Jan 11, 2023, 8:56 PM IST

YCP leader Birthday celebrations on Road: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్​ రమేష్ రెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి జన్మదిన వేడుకలను కదిరిలోని జాతీయ రహదారిపై అట్టహాసంగా నిర్వహించారు. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ మూడు కిలోమీటర్ల మేర.. రద్దీ సమయంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మూడు గంటల పాటు ప్రధాన రహదారిపై యువ నాయకుడి జన్మదిన వేడుకలతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది.

జీవో నెంబర్ 1 నిబంధనలు వైసీపీకి వర్తించవా..!

స్థానిక శాసనసభ్యుడు సిద్ధారెడ్డి కేకును కోసి సంబరాల్లో పాల్గొన్నారు. కదిరి అప్ గ్రేడ్ సర్కిల్ ఇన్​స్పెక్టర్​తో పాటు పలువురు ఎస్సైలు సిబ్బంది జన్మదిన వేడుకల వద్ద విధులు నిర్వహించడం గమనార్హం. జాతీయరహదారిపై సగం వరకు అధికార పార్టీ నాయకులు వాహనాలను ఆపివేయడంతో.. మిగతా సగభాగంలోనే రాకపోకలు కొనసాగించడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 11, 2023, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.