TDP ANITHA COMPLAINT TO NWC : సత్యసాయి జిల్లా కదిరిలో మహిళలపై పోలీసుల దాడిని ఖండిస్తూ జాతీయ మహిళా కమిషన్‌కు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు రెచ్చిపోతూ.. మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ, వారిపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కదిరిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు మహిళలపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 25న కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వీధులు వెడల్పు చేస్తున్న పేరుతో రెవెన్యూ అధికారులు అక్కడున్న షాపులను ధ్వంసం చేశారని.. ఈ నేపథ్యంలో షాపు యజమానులు, మరి కొంతమంది నిరసన తెలియజేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు వారిని అసభ్యకరంగా దుర్భాషాలాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని మండిపడ్డారు.
దళిత వర్గానికి చెందిన సుధారాణి అనే మాజీ కౌన్సిలర్‌ను అసభ్యకరంగా దూషించారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీకి చెందిన కొంత మంది గూండాలు రాళ్లు విసరడంతో అనేక మందికి గాయాలయ్యాయని ఆరోపించారు. ఇన్స్పెక్టర్ చర్యలకు వ్యతిరేకంగా అదే రోజు సాయంత్రం కొంత మంది మహిళలు ఆయన ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపారని.. ఆ సమయంలో మధు, ఆయన సిబ్బంది మహిళలపై లాఠీఛార్జీ చేసి దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
మధు మీసాలు మెలేస్తూ.. తొడలు కొడుతూ మహిళలను అసభ్యకరంగా దూషించారని.. ఆడవారు వారు వంటింటికే పరిమితమవ్వాలి కానీ ..రోడ్ల పైకి రాకూడదంటూ తిట్టారని మండిపడ్డారు. పోలీసుల దాడిలో అనేక మంది మహిళలు గాయపడి ఆసుపత్రి పాలయ్యారని.. అక్కడ అంత గొడవ జరుగుతున్న కానీ మహిళా పోలీసులు ఎవరూ లేరని ఫిర్యాదులో పేర్కొన్నారు. గంగారత్నమ్మ, ప్రవీణ్ బాబి అనే మహిళలు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ ఈ ఘటనపై విచారణ చేసి ఇన్స్పెక్టర్ మధుపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని ఏపిలో మహిళలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
-
వైసీపీ గుండాలతో కుమ్మక్కు అయ్యి, వాళ్ళ భుజాలపై ఊరేగుతూ, మహిళలపై భౌతిక దాడి చేసి, పరుష పదజాలంతో దూషించిన కదిరి సీఐ మధు పై జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటువంటి వారి వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. ప్రజలకు నమ్మకం పోతుంది.@NCWIndia @sharmarekha pic.twitter.com/tPLVxMNLdx
— Anitha Vangalapudi (@Anitha_TDP) February 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">వైసీపీ గుండాలతో కుమ్మక్కు అయ్యి, వాళ్ళ భుజాలపై ఊరేగుతూ, మహిళలపై భౌతిక దాడి చేసి, పరుష పదజాలంతో దూషించిన కదిరి సీఐ మధు పై జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటువంటి వారి వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. ప్రజలకు నమ్మకం పోతుంది.@NCWIndia @sharmarekha pic.twitter.com/tPLVxMNLdx
— Anitha Vangalapudi (@Anitha_TDP) February 28, 2023వైసీపీ గుండాలతో కుమ్మక్కు అయ్యి, వాళ్ళ భుజాలపై ఊరేగుతూ, మహిళలపై భౌతిక దాడి చేసి, పరుష పదజాలంతో దూషించిన కదిరి సీఐ మధు పై జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటువంటి వారి వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. ప్రజలకు నమ్మకం పోతుంది.@NCWIndia @sharmarekha pic.twitter.com/tPLVxMNLdx
— Anitha Vangalapudi (@Anitha_TDP) February 28, 2023
ఇవీ చదవండి: