ETV Bharat / state

కొండలు దోచిన కేతిరెడ్డి అక్రమాలను బట్టబయలు చేస్తాం.. : పరిటాల శ్రీరామ్ - ఏపీ ముఖ్యవార్తలు

Paritala Sriram press meet : ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్రమాలు సామాన్య ప్రజలకు కూడా తెలుసునని ధర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇన్​ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. కేవలం 10ఎకరాల భూమి ఉన్నట్లు గతంలో చెప్పుకొన్న కేతిరెడ్డికి వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని శ్రీరామ్ ప్రశ్నించారు. కేతిరెడ్డి అక్రమాల చిట్టా బయటపెడతామని హెచ్చరించారు.

పరిటాల శ్రీరామ్
పరిటాల శ్రీరామ్
author img

By

Published : Apr 4, 2023, 4:08 PM IST

పరిటాల శ్రీరామ్

Paritala Sriram press meet : ఎమ్మెల్యే కాకముందు దొంగ నోట్ల కేతిరెడ్డి.. ఎమ్మెల్యే అయ్యాక భూముల దొంగ కేతిరెడ్డిని... కేటురెడ్డి అనక మరేమనాలి అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్​ఛార్జ్​ పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు. ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి గుట్టలను ఆక్రమించుకున్నారని నారా లోకేశ్ చేసిన ఆరోపణలపై.. వాటిని నిరూపించాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు. దీనిపై దీటుగా స్పందించిన పరిటాల శ్రీరామ్... కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి అక్రమాలను మీడియా సమావేశంలో వివరించారు.

కేతిరెడ్డి పేరు నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు.. గతంలో దొంగ నోట్ల వ్యవహారంలో దొంగ నోట్ల కేతిరెడ్డిగా పేరున్న వెంకట్రాంరెడ్డి.. ఎమ్మెల్యే అయ్యాక భూముల దొంగ కేతిరెడ్డిగా నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసని శ్రీరామ్ విమర్శించారు. చెరువులో బోటు షికారు కోసమని ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వని తీరు అక్కడ ఏ రైతును అడిగినా చెప్తారని ఆయన అన్నారు.

వందల ఎకరాలు ఎలా వచ్చాయి... 10 ఎకరాల భూమి ఉన్న కేతిరెడ్డికి వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో గుడ్ మార్నింగ్​తో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండను ఆక్రమించి గుర్రాల కోటను కట్టుకున్న కేతిరెడ్డి వ్యవహారం బట్టబయలు చేస్తామని ఆయన హెచ్చరించారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమని, కేతిరెడ్డి అక్రమాలు అన్నింటినీ వెలికి తీసేలా సిట్​తో నిగ్గు తేలుస్తామని పరిటాల శ్రీరామ్ తెలిపారు.

కేతిరెడ్డి.. 25 ఎకరాలు నేను కొన్నాను.. నా ఆధీనంలో ఉంది. ఫామ్ హౌస్ కట్టుకున్నాను అని చెప్పాడు. కానీ, ఆయన కాంట్రాక్టర్ కాదు.. పెద్దగా ఏమీ బిజినెస్​లు కూడా లేవు. పెద్దగా ఏమీ చేయడు బిజినెస్​లు తప్ప. ఇట్లాంటోడికి ధర్మవరం చుట్టు పక్కల కొన్ని వందల ఎకరాలు ఏ రకంగా వచ్చాయి. కొంచెం ఆలోచిస్తే కామన్ మ్యాన్ కూడా అర్థం అవుతుంది. నా ఎన్నికల అఫిడవిట్​లో 5కోట్లు మాత్రమే పెట్టాను అని చెప్తున్న కేతిరెడ్డి.. తమ్ముడు, మరదలు.. ఇంకా బినామీల పేర్ల మీద పెట్టాడు. ధర్మవరంలో ఏ సందులోకి వెళ్లినా, ఏ గొందుకెళ్లినా ఎక్కడివి ఈ భూములన్నీ అంటే వెంకట్రామిరెడ్డివి అని కోడై కూస్తోంది. మా గుర్రాలకోటలో 2020-21లో సంవత్సరంలో 25 ఎకరాల 38 సెంట్ల భూమి మాత్రమే కేతిరెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉంది. వాస్తవ పరిస్థితిలో మాత్రం 45 ఎకరాలు ఆక్రమించారు. ఇందులో కొంత ఆయన మరదలు.. కర్నూలుకు చెందిన గాలి వసుమతి పేరిట.. పిత్రార్జితంగా వచ్చినట్లు పేపర్లు సృష్టించారు. ఇది ఎలా సాధ్యమో కేతిరెడ్డికే తెలియాలి. - పరిటాల శ్రీరామ్, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్​చార్జి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.