Floods problems అంత్యక్రియల కోసం అష్టకష్టాలు పడ్డ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని కంబాలపల్లిలో చోటు చేసుకుంది. గ్రామంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాలంటే.. మార్గమధ్యలో పెద్ద వాగును దాటాల్సి ఉంది. వరద ప్రవహిస్తుండటంతో.. అతికష్టం మీద మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల వాగును దాటించి అంత్యక్రియలు నిర్వహించారు. వృద్ధులు, మహిళలు వాగు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్మశానానికి రోడ్డు వేయాలని ఏళ్ల తరబడి అధికారులకు విన్నవించినా.. పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: