Paritala Sunitha Padayatra: అన్నదాతల కోసం చేస్తున్న పాదయాత్రకు లభిస్తున్న ఆదరణ చూసి అధికారపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుగుదేశం నేత పరిటాల సునీత మండిపడ్డారు. సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్‌ను సునీత కోరారు. అనుమతి కోసం ధర్మవరం డీఎస్పీ వద్దకు వెళ్లాలని సూచించారని, అక్కడికి వెళ్లితే పాదయాత్రకు అనుమతి నిరాకరించారని ఆమె వెల్లడించారు. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా...రైతు సమస్యలపై పోరాటం చేస్తామని పరిటాల సునీత స్పష్టం చేశారు..
ఇవీ చదవండి: