ETV Bharat / state

ఆటోను ఢీకొన్న బొలెరో.. అయిదుగురు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు - road accident in sri sathya sai district

Road Accident in Sathya Sai District: ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టడంతో.. సత్య సాయి జిల్లాలో అయిదుగురు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

road accident
road accident
author img

By

Published : Mar 17, 2023, 10:53 PM IST

Road Accident in Sathya Sai District: సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బత్తలపల్లి నుంచి ధర్మవరానికి వెళ్తున్న ఆటోను.. ధర్మవరం నుంచి బత్తలపల్లి వైపు వెళ్తున్న బొలెరో వాహనం అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్దింది.

ప్రమాదంలో ధర్మవరానికి చెందిన ఆటో డ్రైవర్ నరసింహులు, ప్రయాణికుడు హాజీ పీరా, పోట్లమర్రి గ్రామానికి చెందిన మల్లేశు, ముదిగుబ్బ మండలం నల్లగుంటపల్లికి చెందిన గాలి నారాయణస్వామి, తిరుపాలు అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బొలెరో వాహన డ్రైవర్ కుమ్మరి నరసింహులు, రంగస్వామి అనే వ్యక్తి, మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని ధర్మవరం ప్రభుత్వం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనస్థలానికి బత్తలపల్లి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

లారీని ఓవర్టేక్ చేయబోయి: పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లె గ్రామ సమీపంలోని బాలాజీ ఎస్టేట్ సమీపంలో లారీని ఓవర్​టేక్​ చేయబోయి.. లారీని వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. ములకలపల్లి రామ్మోహన్ అనే వ్యక్తికి కాలు విరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి.. వైద్య సేవలు అందించారు. బస్ డ్రైవర్ పిల్లి నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని లేదని పోలీసులు తెలిపారు.

ప్రయాణ సమయంలో చేతులు బయటకి.. ప్రమాదం: మనం ప్రయాణం చేసే సమయంలో.. చేతులు బయటకు పెట్టొద్దని రాసి ఉండటం.. లేదంటే మనకు ఎవరైనా చెప్పడం వంటివి చాలాసార్లు జరిగి ఉండొచ్చు. ప్రయాణం చేసేటప్పుడు చేతులు బయటకు పెట్టడం ఎంత ప్రమాదమో ఈ ఘటన చూస్తే అర్ధమవుతుంది. ప్రయాణ సమయంలో చెయ్యి బయటకు పెట్టడంతో.. బస్సు పక్కనే వెళ్తున్న ట్రాక్టర్ తగలింది. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని సింగనమల మండలం సింగనమల క్రాస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది.

అనంతపురం నుంచి తాడిపత్రికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో(45) తాతయ్య అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. బస్సులో నుంచి చేయి బయటకు పెట్టి కూర్చున్నాడు. సింగనమల క్రాస్ వద్ద బస్సు ఓవర్​ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ను ఓవర్​టేక్​ చేస్తుండగా.. తాతయ్య చేయికి తగిలింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్​కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.