శ్రీ సత్య సాయి జిల్లా పట్టపర్తిలో ఉజ్వల ఫౌండేషన్ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ఉజ్వల ఫౌండేషన్ భూ ఆక్రమణలకు పాల్పడుతోందంటూ... పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయం ముందు నేడు జనసేన, సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో పుటపర్తి వైకాపా కార్యాలయానికి వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ తగిలింది.
జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి జయరాం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చారు. ఇదే సమయంలో కార్యాలయాన్ని ముట్టడించేందుకు..జనసేన, సీపీఐ నాయకులు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసి పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: