ETV Bharat / state

హిందూపురంలో బాలకృష్ణ మెజారిటీపై వైసీపీలో డిష్యూం డిష్యూం! సొంతపార్టీ నేతలపై కేసులు పెట్టిస్తున్నారంటూ ఎమ్మెల్సీ ఇక్బాల్​పై ఫైర్ - MLC Iqbal Comments On Hindupur MLA Balakrishna

Internal Clashes In Hindupur YSRCP Leaders: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గమన్నాయి. ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్‌ నందమూరి బాలకృష్ణ 2024 ఎన్నికల్లో గెలుస్తారని అనడంతో, వైసీపీ నేత చల్లాపల్లి బాబు రెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతోంది.

Internal_Clashes_In_Hindupur_YSRCP_Leaders

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 11:00 AM IST

Internal Clashes In Hindupur YSRCP Leaders : హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna) 2024 ఎన్నికల్లో (2024 Elections in AP) గెలుపు విషయంలో వైఎస్సార్సీపీ నేతల్లో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గమన్నాయి. ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్‌కు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) పంపిన దూత చల్లాపల్లి బాబు రెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. రాష్ట్రపతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన నేపథ్యంలో హిందూపురం రాజకీయాల గురించి మొహమ్మద్ ఇక్బాల్‌ మాట్లాడారు. పార్టీలో గ్రూపు రాజకీయాల వల్ల 2024 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలుస్తారని.. ఇక్బాల్‌ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో దుమారం లేపుతున్నాయి.

MLA Nandamuri Balakrishna Win in 2024 Elections : ఈ వ్యవహారంపై వైసీపీ నేత చల్లాపల్లి బాబు రెడ్డి స్పందిస్తూ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌ మతిస్థిమితం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన మీద వ్యక్తిగతంగా నిరాధారమైన ఆరోపణలు చేశారని, అందుకు ఆధారాలు చూపించాలని కోరారు. బహిరంగ చర్చకు రావాలని చల్లాపల్లి బాబు రెడ్డి సవాల్ విసిరారు. ఆయన వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు - గడపగడపకు కార్యక్రమం అడ్డుకున్న గ్రామస్థులు, ఉద్రిక్తత

2024 Elections in AP : సీఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో పార్టీని సమస్వయం చేయాలని పంపితే ఇక్కడికి వచ్చి సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్నాని చల్లాపల్లి బాబు రెడ్డి అన్నారు. తనను బీజేపీ వ్యక్తి అని ఆరోపణలు చేస్తున్నారని అససహనం వ్యక్తం చేశారు. ఆయన నాలుగున్నర సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్​లో పని చేస్తున్న గోపీకృష్ణను పీఏగా పెట్టుకుని ఏమి చేశారో అందరికి తెలుసని అన్నారు. సొంతపార్టీ నాయకులపై కేసులు బనాయించి అందరిని పార్టీకి దూరం చేసింది మీరు కాదా అని ఆగ్రహంతో ప్రశ్నించారు. ఆయనే సక్రమంగా పని చేసి ఉంటే టికెట్ ఆయనకే వచ్చేదని, దీపికా వేణు రెడ్డిను హిందూపురం నియోజకవర్గానికి పంపేవారు కాదని పేర్కొన్నారు. ఈ విషయం నీకు తెలియదా అంటూ విమర్శించారు.

వైసీపీలో వర్గపోరు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా అవహేళనలు

YCP Internal Clashes in Hindupur : తన సొంత డబ్బులు పెట్టుకుని పార్టీ కోసం పని చేస్తున్నానని వివరించారు. తమకు సమాచారం ఇచ్చి ఉంటే పార్టీ ఇన్ఛార్జి దీపికతో కలిసి ఇక్బాల్ స్వాగతం పలికేవారేమో అని పేర్కొన్నారు. నాలుగేళ్లలో హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చేసింది శూన్యమని సొంత నేతలే విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేణు రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Internal Clashes Between YCP Leaders At Kuppam: కుప్పం వైసీపీలో వర్గపోరు.. రోడ్డెక్కిన మహిళలు..

2024 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ భారీ మెజారీటీతో గెలుస్తారు-తారాస్థాయికి చేరిన వైసీపీ నేతల వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.