ETV Bharat / state

GVL: 'వైకాపా పోవాలి.. భాజపా రావాలి' అనే నినాదంతో ముందుకు సాగాలి- జీవీఎల్​ - సత్యసాయి జిల్లా తాజా వార్తలు

GVL ON YCP GADAPA GADAPA: 'వైకాపా పోవాలి.. భాజపా రావాలి' అనే నినాదంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు సూచించారు. మూడేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. కదిరిలో నిర్వహించిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

GVL ON YCP GADAPA GADAPA
వైకాపా పోవాలి.. భాజపా రావాలి అనే నినాదంతో ముందుకు సాగాలి
author img

By

Published : Jun 16, 2022, 5:07 PM IST

వైకాపా పోవాలి.. భాజపా రావాలి అనే నినాదంతో ముందుకు సాగాలి

GVL ON YCP GADAPA GADAPA: పేదలకు కేంద్రప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం తీసుకురావాలంటూ.. వైకాపా ఎమ్మెల్యేలను పేదలు నిలదీయాలని.. భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైకాపా పోవాలి.. భాజపా రావాలి అనే నినాదంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు.

భారతదేశంలో 68 ఏళ్లకాలంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తైతే..మోదీ 8సంవత్సరాల పాలనలో జరిగినది మరో ఎత్తని ఆయన అన్నారు. భారత దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు నడిపిస్తూ విశ్వనేతగా మోదీ ఎదిగారని జీవీఎల్ కొనియాడారు. ప్రతి కార్యకర్త ఆయన మార్గంలో నడవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మూడేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారన్నారు.

కేంద్రప్రభుత్వం.. పేదలకుపంపిణీ చేసిన బియ్యాన్ని వారికి అందించకుండా గోదాముల్లో మగ్గేలా చేస్తున్నారని విమర్శించారు. గడపగడపకు ప్రభుత్వం పేరుతో వచ్చే నాయకులను నిలదీయాలని సూచించారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు స్టిక్కర్లు అతికించడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకొచ్చే బాధ్యతను ప్రతి కార్యకర్తలు తీసుకోవాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.