Farmers Fires On Handriniva canal Officers: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం కదిరేపల్లి గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ అధికారులతో స్థానిక రైతులు వాగ్వాదానికి దిగారు. తమ పొలాలకు వెళ్లే దారిలో హంద్రీనీవా కాలువ ఏర్పాటు చేయటం వలన దారి లేదని వాపోయారు. రహదారి సౌకర్యం కల్పించాలంటూ హంద్రీనీవా కాలువ వద్ద పనులు చేస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 15 సంవత్సరాలుగా తమ పొలాలకు వెళ్లేందుకు కాలువ అడ్డంగా ఉందని ఎన్నిసార్లు స్థానిక అధికారులతో మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. పంట పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. వెంటనే కాలువ మీదుగా వంతెన ఏర్పాటు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలకు వెళ్లేందుకు తాత్కాలిక వంతెన ఏర్పాటు చేస్తామని హంద్రీనీవా అధికారులు రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు అక్కడినుంచి వెనుతిరిగారు.
ఇవీ చదవండి