ETV Bharat / state

తలుపుల జూనియర్ కళాశాల ఘటనలో.. కామర్స్ అధ్యాపకుడిపై చర్యలు - శ్రీ సత్యసాయి జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Inquiry on lecturers sexual harassment: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల జూనియర్ కళాశాలలో లైంగిక వేధింపుల ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కామర్స్ అధ్యాపకుడు నాగరాజును విధుల నుంచి తొలగించారు. మిగతా నిందితులపై కళాశాలలో అధికారుల విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.

Inquiry on lecturers sexual harassment
తలుపుల జూనియర్ కళాశాల వ్యవహారంపై కలెక్టర్ స్పందన
author img

By

Published : Apr 20, 2022, 1:43 PM IST

Updated : Apr 20, 2022, 4:48 PM IST

Inquiry on lecturers sexual harassment: సత్యసాయి జిల్లా తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న ఇద్దరు అధ్యాపకుల వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న అధికారులు.. కామర్స్ అధ్యాపకుడు నాగరాజును విధుల నుంచి తొలగించారు. మిగతా నిందితులపై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..? : సత్యసాయి జిల్లా తలుపుల జూనియర్‌ కళాశాలలో... ఇద్దరు అధ్యాపకుల అరాచకాలు, వేధింపులతో విద్యార్థినులు అల్లాడిపోతున్నారు. చదువు మానలేక, వాళ్ల వేధింపులు భరించలేక సతమతమవుతున్నారు. తల్లి లేక తండ్రి చనిపోయి సింగిల్‌ పేరెంట్ ఉన్న విద్యార్థినులనే లక్ష్యంగా చేసుకుని... అసభ్యంగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు అధ్యాపకులు. అమ్మాయిల ఫోన్‌ నెంబర్లు సేకరించి... దారుణంగా వేధింపులకు గురిచేస్తున్నారు. అమ్మాయిల ముందే అబ్బాయిలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గోవా బీచ్‌ ఎంజాయ్‌మెంట్‌ చూపిస్తా అంటూ ఒకరు రెచ్చిపోతుంటే.... ఒళ్లో కూర్చోమంటూ మరొకరు హింసిస్తున్నారని బాధిత విద్యార్థినులు వాపోతున్నారు.

ఎవరికి చెప్పినా.. ప్రయోజనం శూన్యం: అధ్యాపకుల ఆగడాలను ఇంట్లోవాళ్ల దృష్టికి తీసుకెళ్లే ధైర్యం లేక ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే... చర్యలు తీసుకోకుండా బాధితులపైనే ఒత్తిడి తీసుకొచ్చారు. మరో అధ్యాపకురాలికి బాధలు చెప్పుకుంటే.. విద్యార్థినుల పక్షాన నిలబడ్డారని ఆమెనూ వేధించారు. ఇక లాభం లేదనుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాక.. ఆ కీచకులు మరింత రెచ్చిపోయారు. ఒప్పంద లెక్చరర్లతో జట్టు కట్టి వేధింపులు తీవ్రం చేశారు. సమస్యను విద్యార్థి సంఘాల నాయకులకు చెబితే... తొలుత హడావుడి చేసిన వారంతా ఆ తర్వాత కీచకులతో కలసిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చర్యలు తీసుకున్న అధికారులు.. కామర్స్ అధ్యాపకుడు నాగరాజును విధుల నుంచి తొలగించారు.

సంబంధిత కథనం: SEXUAL HARASSMENT : విద్యార్థునుల పాలిట కీచకుల్లా అధ్యాపకులు.. వెకిలి చేష్టలతో వేధింపులు

Last Updated : Apr 20, 2022, 4:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.