ETV Bharat / state

YSRCP MLC: హిందూపురంలో వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్​కు వ్యతిరేకంగా.. బందుకు పిలుపు

YSRCP MLC Mohammad Iqbal: సత్యసాయి జిల్లా హిందూపురంలో వైకాపా ఎమ్మెల్సీ  మహ్మద్ ఇక్బాల్​కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమయ్యారు. హిందూపురం వైకాపా మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యను నిరసిస్తూ ఆర్​అండబీ అతిథి గృహంలో వైకాపా, తెదేపా, భాజపా నేతలంతా సమావేశం నిర్వహించారు. ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో ఇక్బాల్‌ హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని వైకాపా సహా ఇతర పార్టీల నేతలు మండిపడ్డారు. హత్యకేసులో ఇక్బాల్‌ను A1, ఆయన పీఏను A-2గా చేర్చాలని డిమాండ్ చేశారు. సోమవారం హిందూపురం వస్తున్న ఇక్బాల్‌ నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని.. అన్నిపార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక్బాల్ గోబ్యాక్ నినాదంతో సోమవారం హిందూపురం బంద్‌ కు అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు.

YSRCP MLC Mohammad Iqbal
హిందూపురంలో వైకాపా ఎమ్మెల్సీ
author img

By

Published : Oct 29, 2022, 6:33 PM IST

Updated : Oct 29, 2022, 10:31 PM IST

వైకాపా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్​కు వ్యతిరేకంగా.. బందుకు పిలుపు
YSRCP MLC Mohammad Iqbal in Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్​కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమయ్యారు. స్వంత పార్టీ నేతల మీదనే క్రిమినల్ కేసులు పెట్టిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీ ఇక్బాల్​కు వ్యతిరేకంగా హిందూపురంలో అధికార పార్టీ నేతలు మూడు వర్గాలుగా విడిపోయారు. దీనిలో రెండు వర్గాలు ఎమ్మెల్సీకి పూర్తిగా వ్యతిరేకంగా కార్యక్రమాలు, సమావేశాలు, ప్రకటనలు చేస్తుండేవారు. ఈ క్రమంలోనే హిందూపురం వైకాపా మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యతో ఒక్కసారిగా అక్కడ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.

హత్యారాజకీయాలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో చిచ్చుపెడుతూ, స్థానికేతరుడైన ఎమ్మెల్సీని హిందూపురంలో అడుగుపెట్టనీయరాదని అన్ని రాజకీయ పార్టీల నేతలు తీర్మానించారు. వైకాపా, తెదేపా, భాజపా హిందూపురం నియోజకవర్గ నేతలంతా సంయుక్త సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ ఇక్బాల్​కు వ్యతిరేకంగా ఏకాభిప్రాయంతో తీర్మానాలు చేశారు. స్వంత పార్టీ నేతలపైనే అక్రమ కేసులు పెట్టిస్తున్న వైనాన్ని.. చాలా కాలంగా వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ నేతలు తాజాగా ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకొని బలం పుంజుకున్నారు.

ఆ నియోజక వర్గంలో ఇప్పటి వరకు ఇక్బాల్​కు వ్యతిరేకంగా రెండు వర్గాలు ఉండగా, తాజాగా అన్ని రాజకీయ పార్టీలు హిందూపురం హత్యారాజకీయాలను వ్యతిరేకిస్తూ ఒకే వేదికమీదకు వచ్చాయి. ఇవాళ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కు వ్యతిరేకంగా నియోజకవర్గ వైకాపా, తెదేపా, భాజపా నేతలంతా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ హత్యారాజకీయాలతో ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన స్వంత పార్టీలోని వైకాపా నేతలే ఆరోపించారు.
హిందూపురంలో ఎమ్మెల్సీ, ఆయన పీఏ అక్రమాలపై ప్రశ్నించిన స్వంతపార్టీ వైకాపా నాయకులపై అక్రమ కేసులు పెట్టించి, పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని అక్కడి వైకాపా నేతలు చాలా సందర్భాల్లో ఆందోళన నిర్వహించారు. గతంలో ఎమ్మెల్సీ అక్రమాలపై వైకాపా నేత కొండూరు వేణుగోపాల్ రెడ్డి పట్టణ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, ఎమ్మెల్సీ ఇక్బాల్, ప్రెస్ క్లబ్ వద్దకు వెళ్లి స్వంత పార్టీ నేతలపై స్వయంగా రాళ్లదాడి చేశారు. మరో సందర్భంలో తెదేపా నేతలు కూడా ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించటానికి వెళ్లగా ఎమ్మెల్సీ వర్గీయులతో దాడులు చేయించారు. నియోజకవర్గ వ్యాప్తంగా స్వంత పార్టీ వైకాపాతోపాటు తెదేపా, భాజపా నేతలపై ఎమ్మెల్సీ, ఆయన వర్గం కార్యకర్తల దాడులు, అరాచకాలపై ఆయా పార్టీల నేతలు ఎప్పటికప్పుడు ఖండంచారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైకాపా మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యతో అన్ని రాజకీయ పార్టీల నేతలంతా ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఒకే వేదికపై కలిశారు. రామకృష్ణారెడ్డి హత్యకేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఈరోజు జరిగిన సమావేశంలో నేతలంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

హత్యకేసులో వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ను ఏ-1 నిందితుడిగా, ఆయన పీఏ గోపీకృష్ణను ఏ-2 నిందితులుగా చేర్చాలని అఖిలపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ సోమవారం హిందూపురం వస్తున్నందున ఆయన నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ గోబ్యాక్ నినాదంతో సోమవారం హిందూపురం బంద్ కు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 29, 2022, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.