ETV Bharat / state

లంపి స్కిన్​తో ఎద్దు మృతి.. రైతుల్లో గుబులు

lumpy Skin Virus: లంపి స్కిన్​ వైరస్​ పాడి రైతులలో గుబులు పుట్టిస్తోంది. ఈ వైరస్​ బారిన పడి పశువులు మృతి చెందటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులు వ్యాధులతో మృతి చెందటం పాడి రైతులు ఆర్థికంగా భారంగా మారుతోంది. దీనినుంచి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

lumpy Skin Virus
లంపి స్కిన్​ వైరస్​
author img

By

Published : Nov 15, 2022, 6:07 PM IST

Lumpy Skin Virus In AP: శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఎద్దు లంపి స్కిన్ వైరస్ బారిన పడి మృతి చెందింది. మృతి చెందిన ఎద్దును గ్రామస్థుల సహాయంతో ఖననం చేశారు. పశువులకు సోకుతున్న ఈ కొత్త రకం వ్యాధితో నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. రోగాల బారిన పడి మృతి చెందిన పశువులకు.. ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వైరస్ సోకకుండా మడకశిర నియోజకవర్గంలో 90 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైనట్లు పశుసంవర్ధక శాఖ సంచాలకులు అమర్ తెలిపారు. ముఖ్యంగా ఈ వ్యాధి తెల్ల జాతీ పశువులకు అధికంగా సంక్రమిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైరస్ సోకకుండా రైతులు పశువులకు వెంటనే టీకాలు వేయించుకోవాలని సూచించారు. వ్యాధి తీవ్రత తగ్గే వరకు రైతులు ఇతర ప్రాంతాల నుంచి పశువులను తీసుకురావడం లేదా ఇతర ప్రాంతాలకు పశువులను తరలించటం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.