Penukonda MLA Shankar Narayana: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అసమ్మతి వర్గాల నేతలు కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలో గల బాట సుంకులమ్మ దేవాలయం వద్ద పొట్టేళ్లను బలిచ్చి విందు ఏర్పాటు చేయడం చర్చనీయాశంగా మారింది. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ మంత్రి పదవి తొలగించినందుకే పొట్టేళ్లు బలిచ్చారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. వాయిదాలు పడుతూ వచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించినట్లు సమాచారం. అసమ్మతి వర్గం నేతల్లో పెనుకొండ మండలానికి చెందిన కర్ర సంజీవరెడ్డిని పార్టీ నుంచి తొలగించినట్లు తొలగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో మరి కొంతమంది నేతలను పార్టీ నుంచి తొలగిస్తారని చర్చ జరుగుతోంది.
ఇవీ చదవండి: