లోక్సభ స్థానాల ప్రాతిపదికగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆయనకు... పలువురు జిల్లా ఏర్పాటు విషయమై వినతి పత్రం అందజేశారు. మార్కాపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి... మార్కాపురాన్ని జిల్లాగా చేసే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. ఒక వేళ పార్లమెంట్ స్థానాలతో పాటు అదనంగా జిల్లాలు పెంచే ఆలోచన ఉంటే ఈ దిశగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. జిల్లాగా ఏర్పాటు కాకపోయినా మార్కాపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: