చీరాల నియోజకవర్గ పరిధిలో ఉన్న 219 జాతీయ రహదారిపై ప్రతి జంక్షన్ వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై.. వైకాపా నాయకుడు పాలేటి రామారావు, వరికూటి అమృతపాణి... చీరాల విద్యుత్ ఏడీఈ శ్రీమన్నారాయణతో కలిసి తోటవారి పాలెం నుంచి చల్లా రెడ్డిపాలెం వరకు ఉన్న అన్ని కూడళ్లు పరిశీలించారు.
రాత్రిళ్ళు కూడళ్లలో వీధి దీపాలు లేకపోవడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామస్థుల అభ్యర్ధన మేరకు అధికారులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. చీరాల మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, మించాలా సాంబశివరావు, చుండూరి వాసులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: