హైకోర్టు ఆగ్రహించినా... మళ్లీ రంగులు వేశారు..! - ప్రకాశం జిల్లా పామిడిపాడులో వైకాపా రంగులు
ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయవద్దని హైకోర్టు స్పష్టం చేసినా... కొన్ని గ్రామాల్లో నాయకులు వైకాపా రంగులు వేస్తూనే ఉన్నారు. నిన్నటివరకు గ్రామ సచివాలయాలకే పరిమితమైన ఈ రంగుల వ్యవహారం... ఇప్పుడు ఆరోగ్య కేంద్రాలకు పాకింది. ప్రకాశం జిల్లా కొరిశాపాడు మండలం పామిడిపాడు గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రానికి వైకాపా రంగులు వేశారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాయంత్రానికే పార్టీ రంగులను తొలగించారు.