ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే వేసిన మెట్ట పంటలు పత్తి, కంది, మిరప పంటలకు ఈ వర్షాలు బాగా ఉపయోగపడుతున్నాయని రైతన్నలు అంటున్నారు. గత కొన్ని నెలలుగా నీటి జాడ లేక వెలవెలబోయిన చెక్ డ్యాములు ఇప్పుడు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు పెరిగే అవకాశముందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, వివిధరకాల పంటలు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బోర్ల కింద సాగు చేసిన కంది, పత్తి, మిరప, సజ్జ, తదితర పంటలకు ఈ వర్షంతో మేలు చేకూరుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి.శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి- 4 గేట్లు ఎత్తివేత